పిల్లిని పెళ్లి చేసుకుంటున్న మనిషి..దీనికో రీజన్ - Telugu News - Mic tv
mictv telugu

పిల్లిని పెళ్లి చేసుకుంటున్న మనిషి..దీనికో రీజన్

May 21, 2020

ఏదైనా స్వచ్చంధ సంస్థ కోసం నిధులు సేకరించడానికి కొందరు వింత వింత పనులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాకు చెందిన స్కాట్‌ పెర్రీ అనే వ్యక్తి మాత్రం పిల్లిని పెళ్లాడాడు. దీనికి కో కారణం లేకపోలేదు. పెర్రీ ఒకరోజు రోడ్డు పై నడుచుకుంటూ వస్తుండగా అతడికి ఒక పిల్లి కనపడింది. చూడడానికి అది చూడముచ్చటగా ఉంది.

పెర్రీ తొలిచూపులోనే ఆ పిల్లితో ప్రేమలో పడ్డాడు. దీంతో దానిని తెచ్చుకుని మార్జాలా అని పేరుపెట్టుకుని పెంచుకొంటున్నాడు. తాజాగా అలా రోడ్లపై అనాథలాగా ఉంటున్న జ్ఞాతులకోసం పెర్రీ నిధులను సేకరించాలి, వాటి కోసం ఓ షెల్టర్ హోమ్ ను నిర్మించాలి అనుకున్నాడు. ఇందుకోసం దానిని పెళ్లి చేసుకోవాలని నిశయించుకున్నాడు. ఈ విషయాలను పెర్రీ ట్విట్టర్ లో షేర్ చేశాడు. నెటిజన్లు తగిన సాయం చేయాలని కోరాడు.