గర్భం ధరించిన మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతారు. అడుగు తీసి అడుగు వేయాలన్నా ఆచితూచి నడవాలని అంటారు. చిన్న చిన్న వ్యాయామాలు తప్ప బరువైన పనులు చేయనివ్వరు. నడక కూడా ఎక్కువ దూరం మంచిది కాదని అంటూ ఉంటారు. తొమ్మిది నెలలు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ ఓ 9 నెలల గర్భిణి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. నడవటమే కాదు.. ఏకంగా పరుగు పందెంలో పాల్గొంది. ఏ మాత్రం అలసట లేకుండా చాలా సులువుగా గమ్యాన్ని చేరుకుంది. 5 నిమిషాల్లోనే 1.6 కిలోమీటర్లు పెరిగెత్తి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ధైర్యం, సాహసం చూసిన అంతా ఔరా అంటున్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 28 ఏళ్ల అథ్లెట్ మాకెన్నా మైలర్ ఈ ఘనతను సాధించింది. గతంలో రన్నర్‌గా ఎన్నో విజయాలను అందుకుంది. గర్భవతి అయిన తర్వాత ఇంట్లోనే ఉండటం ఆమెకు నచ్చలేదు. ఈ సమయంలో కూడా తాను ఎందుకు పరుగుు పెట్టకూడదు అని ప్రశ్నించుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది. అతను కూడా ప్రోత్సహించడంతో తన కసరత్తు ప్రారంభించింది. పరుగు పందెంలో గెలిస్తే.. మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పడంతో మాకెన్నా పట్టుదలతో పరిగెత్తి విజయం సాధించింది. సాధారణ వ్యక్తులు కూడా 1.6 కిలోమీటర్ల పరుగు పూర్తిచేయాలంటే 9 నుంచి 10 నిమిషాలు పడుతుంది. కానీ మాకెన్నా మాత్రం 5 నిమిషాల 25 సెకల్లో పూర్తి చేసింది. ఆమె భర్త వీడియో షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టటంతో వైరల్ అయింది.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే మాకెన్నా గర్భం వచ్చిన తర్వాత కరోనా వైరస్ బారిన పడింది. మహమ్మారిని జయించటంతో పాటు అరుదైన ఘనత సాధించింది. పరుగు పందెంలో పాల్గొన్న ఆమె మామూలు సమయాల్లో పెరిగెత్తినట్టుగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా దూసుకుపోయింది. అన్నిఆరోగ్య నియమాలను పాటిస్తూ.. ఫిట్ నెస్ ఉండటం వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. తాను ఇలా రన్నింగ్ చేయగలుగుతానని అనుకోలేదని చెప్పింది. మొదట కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించానని, కానీ ఆ తర్వాత తానెందుకు చేయలేనని ఈ సాహసానికి సిద్ధమయ్యానని అంటోంది. ఆమె చేసిన ప్రయత్నాన్ని ప్రపంచ రికార్డుల్లో చేర్చాలని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
……………………………………………………………………………………………………….
స్లగ్స్ :
గర్భం వచ్చిన మహిళలు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి
అడుగు తీసి అడుగు వేయాలన్నా ఆలోచిస్తారు
అమెరికాలోని ఓ అథ్లెంట్ మాత్రం దీనికి భిన్నం
9 నెలల గర్భవతిగా ఉన్నా పరుగు పందెంలో నిలిచింది
1.6 కిలోమీటర్ల దూరాన్ని 5.25 సెకన్లలో చేరింది
అరుదైన రికార్డు సాధించిన అథ్లెంట్ మాకెన్నా మైలర్
రన్నింగ్ ట్రాక్‌పై సాధారణ వ్యక్తిలా పరుగులు
వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భర్త
అన్ని జాగ్రత్తల వల్లే సాధ్యమైందంటున్న మాకెన్నా
ప్రపంచ రికార్డుల్లో చేర్చాలంటున్న నెటిజన్లు
వీడియో కోసం లింకు :