భూమి లాంటి నాలుగు కొత్త గ్రహాలు …

భూమి లాంటి మరో నాలుగు గ్రహాలను కనిపెట్టారు. భూమికి 12 కాంతి సంవత్సరాల దూరంలో టావు సెటి అనే సూర్యుడి తరహ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. అని అమెరికా కు చెందిన కాలిఫోర్నీయా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి గుర్తించారు. ఈ గ్రహాలను ఏ పరికాలు లేకుండా మానవులు చూడవచ్చని తెలిపారు. భూమికి 1.7 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశితో ఈ గ్రహాలున్నాయని. ఈ గ్రహాల ఉపరితలం పైన ద్రవరూపంలో నీరు ఉండేందుకు అవకాశం ఉందనీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటివరకు కనుగొన్న సూర్యుడి తరహ నక్షత్ర కుంటుంబాల్లో అతి చిన్న గ్రహాలు ఇవేనట . టావు సెటి గమనంలో చోటు చేసుకున్న కదలికలను విశ్లేషించడం ద్వారా గుర్తించారు. సెకనుకు 30 సెం. మీ.లు లాంటి చిన్న చిన్న కదలికలను కూడా కనిపెట్టే టెక్నాలజీ ను ఉపయోగించం అని తెలిపారు. భూమి లాంటి గ్రహాలను కనుగొనుటకు సంబందించి ఇది ఒక మైలురాయిగా పేర్కొన్నారు.

 

SHARE