మగవారి బట్టతల ఆడవారి రొమ్ముతో సమానం : కోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

మగవారి బట్టతల ఆడవారి రొమ్ముతో సమానం : కోర్టు

May 14, 2022

 

బట్టతల ఉన్న మగవారిని ఆ పేరుతో పిలిచి ఎగతాళి చేయడం లైంగిక వేధింపు కిందకు వస్తుందని ఇంగ్లండులోని ఓ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఇలా పిలవడం మహిళల రొమ్ము గురించి కామెంట్ చేయడంతో సమానమని వ్యాఖ్యానించింది. యార్క్ షైర్‌లో 24 ఏళ్లుగా ఓ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తిని సూపర్ వైజర్ బట్టతల పేరుతో పిలిచాడు. దీంతో తనను అలా పిలిచి మానసిక క్షోభకు గురిచేశాడని ఆ వ్యక్తి ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశాడు. పిటిషన్‌ను విచారించిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బృందం.. పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. బట్టతల అనే పదం లైంగిక వేధింపు కిందకు వస్తుందని, వ్యక్తి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని కోర్టు పేర్కొంది. బాధిత వ్యక్తిని వేధించినందుకు, ఉద్యోగం నుంచి తొలగించినందుకు కంపెనీ తగిన నష్టపరిహారాన్ని ఇవ్వాలని తీర్పునిచ్చింది.