కెల్విన్ ఎవరు ? ఎక్కడి నుండి వచ్చాడు ? - MicTv.in - Telugu News
mictv telugu

కెల్విన్ ఎవరు ? ఎక్కడి నుండి వచ్చాడు ?

July 26, 2017

ప్రస్తుతం హైదరాబాదులో డ్రగ్స్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న పేరు కెల్విన్. అతని అరెస్ట్ వార్త విని చుట్టుపక్కల వాళ్ళు షాక్ కు గురయ్యారు ? ఓల్డ్ బోయిన్ పల్లి ప్రాంతం అంతా టెన్షన్ వాతావరణం అలుముకొంది. సినిమా రంగానికి డ్రగ్స్ రుచి చూపించిన డ్రగ్ రాజుగా కెల్విన్ ఇప్పుడు సిట్ విచారణలో వున్నాడు. అసలు ఈ కెల్విన్ ఎవరు ? ఎక్కడి నుండి వచ్చాడు ? ఎందుకు ఈ డ్రగ్స్ ను బిజినెస్ గా ఎంచుకున్నాడు ? అనే ప్రశ్నలకు సమాధానాలను చూస్కుంటే.. కెల్విన్ అసలు పేరు కెల్విన్ మాస్కరెన్హాస్. కొంత కాలంగా హైదరాబాదు ఓల్డ్ బోయిన్ పల్లిలో తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి నివసిస్తున్నాడు. అతను మంగుళూరు సెయింట్ అలోయిసిస్ కాలేజీలో BBM, ICFAI విశ్వ విద్యాలయం నుండి ఎంబిఏ చదివినట్టు అతని ఎఫ్ బీ అకౌంట్ తెలుపుతోంది. అతని నాన్న రిటైర్డ్ ఆర్మీ కాగా తల్లి బ్యాంకు ఉద్యోగి.

కెల్విన్ గురించి, అతని కుటుంబం గురించి చుట్టు ప్రక్కల వాళ్ళు చాలా పాజిటివ్ గానే చెబుతున్నారు. వాళ్ళింటి డోర్లు ఎప్పుడూ మూసే వుండేవని, ఇంత వరకు వాళ్లు ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేదని అంటున్నారు. ఒక కెల్విన్ కు ఈ సరౌండింగ్ ఫ్రెండ్స్ అస్సల్లేరు పొద్దస్తమానం అస్సలు కనిపించేవాడు కూడా కాదు. ఎక్కువగా రాత్రిపూటే ఇంటికొచ్చేవాడంట. అతని ఇంట్లో ఒక కారు, రెండు బైకులు వుండేవని, వాటి మీద ఆర్మీ స్టిక్కర్స్ కూడా వుంటాయిని చెప్తున్నారు. కెల్విన్ తో పాటు అరెస్ట్ అయినవాళ్ళలో మహ్మద్ అబ్దుల్ వాహెద్, మహ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ లు కూడా వున్నారు. ఎక్సైజ్ డిపార్ట్ మెంటు కథనం ప్రకారం హైదరాబాదు సిటీలోని పేరున్న కాలేజీలు, స్కూళ్ళలోని 1000 మంది వరకు స్టూడెంట్స్ ని డ్రగ్స్ కి బానిసలను చేసింది ఈ గ్యాంగు పనేనని భావిస్తున్నారు. వాళ్ళకు సప్లై చేసిన డ్రగ్స్ LSD, MDMA అనబడే అత్యధిక డోసు గలవి, అవి ప్రాణాంతకమైనవి. 8 నుండి 13 సంవత్సరాల వయస్సున్న పిల్లలను డ్రగ్స్ కు బానిసలను చేసిన పాపం కెల్విన్ గ్యాంగుదేనని ఆరోపిస్తున్నారు.

తను ఎంచుకున్న ఈ దందాలో ఎక్కువగా ఈవెంట్ మేనేజర్లను, హై ప్రొఫేషనల్ పర్సన్స్ ని టార్గెట్ చేసి వారితో పరిచయం పెంచుకొని తన పని కానిచ్చుకునేవాడట. తన డ్రగ్స్ సప్లైలు ఎక్కువగా కొరియర్, పోస్టల్ సర్వీసుల ద్వారా చేసేవాడట. ఒక్కోసారి వారి వారి పీఏలతో లేదా, డ్రైవర్లతో కూడా LSD డ్రగ్, కొకైన్ లను సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.

అలాగే అతని తరుపు వాదిస్తున్న లాయర్ రేవంత్ రావు చెప్తున్నదాని ప్రకారం కెల్విన్ చాలా సాఫ్ట్ నేచర్ వున్నవాడని, ప్రతి ఆదివారం చర్చ్ కు వెళ్లి అక్కడ చక్కగా డ్రమ్స్ వాయిస్తాడని, ఇంకా అతని చదువు కొనసాగుతోందని. 2013 లో అతని మీద ఒక కేసు నమోదైనట్టు కూడా చెప్తున్నాడు. విచారణ పూర్తవకుండానే మీడియా అతణ్ని నేరస్థుణ్ని చేయటం సబబుగా లేదని అంటున్నాడు. విచారణ పూర్తైతే గానీ అసలు దోషి ఎవరో ? నకిలీ దోషి ఎవరో తేలుతుంది ? చూడాలి మరి సిట్ విచారణ అనంతరం ఈ డ్రగ్స్ మాఫియాలో కెల్విన్ పాత్ర ఏ మేరకు వుందనేది !?

( THE NEWS MINUTE SOURCE )

http://www.thenewsminute.com/article/tracking-calvin-mascarenhas-middle-class-boy-next-door-who-turned-hyderabads-drug-kingpin

https://www.facebook.com/calvin.mascarenhas.5