రణరంగ చౌక్ - MicTv.in - Telugu News
mictv telugu

రణరంగ చౌక్

May 15, 2017


ధర్నాచౌక్‌ తరలింపును నిరసిస్తూ అఖిలపక్షం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అఖిలపక్షానికి వ్యతిరేకంగా స్థానికులు నిరసన చేపట్టడంతో ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడటంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఇందిరాపార్క్‌ లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన అఖిలపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులపై లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురు కార్యకర్తలు, స్థానికులు గాయపడ్డారు.

ధర్నాచౌక్‌ వల్ల తామెంతో ఇబ్బందులు పడుతున్నామని.. దీన్ని ఇక్కడి నుంచి తరలించాల్సిందేనని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఇన్నాళ్లకు తమ మొర విని ధర్నాచౌక్‌ను తరలించేందుకు చర్యలు తీసుకుంటుంటే అడ్డుకోవడం సరికాదని అంటున్నారు.

మరోవైపు ఈ ఘర్షణల వెనుక ప్రభుత్వం, పోలీసుల హస్తం ఉందని అఖిలపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ప్రశాంతంగా నిర్వహిస్తున్న ఆందోళనలో అలజడి రేపి శాంతిభద్రతల సాకుతో తమ నిరసనను అడ్డుకోవాలని చూస్తున్నారని వారంటున్నారు.

HACK:

  • Campaigning against the TRS government to shift ‘Dharna Chowk’ at the Indira Park here clashed with local residents after their protest.