Campus placement in Hyderabad city college annapareddy appireddy
mictv telugu

త్వరలో సిటీ కాలేజీలో ఉద్యోగ మేళా.. అప్పిరెడ్డి

September 14, 2022

Campus placement in Hyderabad city college annapareddy appireddy

శత వసంతాలు పూర్తి చూసుకున్న హైదరాబాద్ సిటీ కళాశాల విద్యార్థులకు వర్కాగ్, మైక్ టీవీ సంస్థల అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్ది శుభవార్త చెప్పారు. త్వరలో కాలేజీలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ చేపడతామని వెల్లడించారు. ఆయన బుధవారం కాలేజీలో తెలుగు శాఖ నిర్వహించిన “కాళోజీ జీవితం-సాహిత్యం” సదస్సులో పాల్గొని ప్రసంగించారు. వివిధ పోటీల్లో నెగ్గిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

కాలేజీపై డాక్యుమెంటరీ నిర్మాణానికి సహకారం అందించిన ఆయన కాలేజీ విద్యార్థులు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని కోరారు.
‘‘నేను కూడా ప్రభుత్వ పాఠశాలోనే చదివాను. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకున్నా, ఉద్యోగ వ్యాపారాలు చేసినా తెలంగాణ చరిత్ర సంస్కృతి ఔన్నత్యాన్ని చాటి చెప్పటానికి మైక్ టీవీవి నెలకొల్పాను. సిటీ కళాశాల వంద సంవత్సరాల సందర్భంగా రూపొందించిన డాక్యుమెంటరీ నిర్మాణంలో భాగమయ్యాం. సిటీ కళాశాల అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను. ఇక్కడి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్యోగ మేళా నిర్వహిస్తాం’ అని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజీపై నిర్మించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.పి.బాల భాస్కర్, డాక్యుమెంటరీ డైరెక్టర్ అజహర్ షేక్, యువ చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. తెలుగు సాహిత్యంలో, సమాజంలో నిజాయితీ, నిరాడంబరత, నిబద్ధతకు నిలువెత్తు రూపం కాళోజీ అని హరగోపాల్ అన్నారు.

Campus placement in Hyderabad city college annapareddy appireddy