ఏపీలో జగన్ ప్రభుత్వం ‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలో బెనిఫిట్ షోలను ఆపగలదేమో కానీ, పవన్ కల్యాణ్ మీదున్న మా అభిమానాన్ని మాత్రం ఆపలేదు” అంటూ అభిమానులు గురువారం విజయవాడ రోడ్లపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ.. “జగన్ ప్రభుత్వం పవన్ కల్యాణ్‌పై కావాలనే కక్ష సాధిస్తుంది. గత రెండు నెలలుగా లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకొచ్చాయి. ఏపీ ప్రభుత్వం పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకే ఈ కక్ష సాధింస్తుంది” అని ఆరోపించారు.
అంతేకాకుండా చేతనైతే ప్రభుత్వం రాజకీయ పరంగా ఎదుర్కొవాలి. సత్తా లేని వాళ్లలాగా కళారంగాన్ని టార్గెట్ చేయకూడదు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రం సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడుతుంటే, జగన్ ప్రభుత్వం మాత్రం సినిమా పరిశ్రమపై కక్ష సాధిస్తుంది అని మండిపడ్డారు.