కొబ్బరినూనెతో కరోనాకు చెక్? - MicTv.in - Telugu News
mictv telugu

కొబ్బరినూనెతో కరోనాకు చెక్?

July 6, 2020

Kerala

కరోనాను నయం చేసే క్రమంలో రకరకాల మందుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి.  తాజాగా కొబ్బరినూనెతో కూడా కరోనా కంట్రోల్ అవుతుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. కేరళలో కరోనా పెద్దగా ప్రభావం చూపకపోవడానికి కారణం ఈ కొబ్బరి నూనేననే మాటలు వినిపిస్తున్నాయి. ఫిజీషియన్స్ అసోసియేషన్ జర్నల్‌లో ఈ విషయమై ఓ అధ్యయనమే ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న డాక్టర్ శశాంక్ జోషి కొబ్బరినూనె విశిష్టత గురించి వివరించారు. కొబ్బరినూనెను ఎక్కువగా వాడుతుండడం వల్లే కేరళ ప్రజలు కరోనా మహమ్మారిపై గట్టిగా పోరాడగలుగుతున్నారని వెల్లడించారు. కొబ్బరినూనెలో రోగనిరోధక శక్తిని పెంచే కారకాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనంలో తెలిపారు. కొబ్బరినూనెలోని యాంటీ మైక్రోబయాల్ కారకాలు.. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ప్రక్రియకు కీలకంగా భావించే యాంటీ ఇన్ ఫ్లమేటరీ వ్యవస్థను క్రియాశీలకంగా మార్చుతాయని చెప్పారు. 

కొబ్బరినూనె, దాన్నుంచి తయారయ్యే ఉత్పత్తులు మానవ శరీరంలో ఇమ్యూనో మాడ్యులేటరీ ఏజెంట్లుగా అత్యంత సురక్షితమని అన్నారు. ఇదిలావుండగా కరోనాపై కొబ్బరినూనె సమర్థతపై జరిగిన ప్రయోగాలు స్వల్పమని పరిశోధకులు భావిస్తున్నారు.  దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని అంటున్నారు. మరోవైపు కొబ్బరినూనెను వైద్యుల సలహా లేకుండా వంటల్లో ఉపయోగించరాదని, నేరుగా సేవించరాదని హెచ్చరిస్తున్నారు. కాగా, భారతదేశం ఆయుర్వేద వైద్య శాస్త్రానికి పుట్టినిల్లు అన్న విషయం తెలిసిందే. కొబ్బరినూనెలో ఔషధ విలువలు ఉన్నాయని ప్రాచీనకాలం నుంచి భావిస్తున్నారు. కేరళలో కొబ్బరినూనెను వంటల్లోనూ ఉపయోగిస్తారని తెలిసిందే.