పొగ తాగితే ఆస్తమా తగ్గుతుందా? నిజమా! - MicTv.in - Telugu News
mictv telugu

పొగ తాగితే ఆస్తమా తగ్గుతుందా? నిజమా!

July 9, 2019

Can smoking cure asthma 

ఆహార పదార్థాలపైనే కాకుండా, కొన్ని దురవాట్లపైనా ప్రజల్లో కొన్ని అపోహలు రాజ్యమేలుంతుంటాయి. టీ, కాఫీలు మంచివని, మద్యం మోతాదుకు మించకపోతే మేలు చేస్తుందని కొందరు చెబుతుంటారు. ధూమపానంపైనా ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. సిగరెట్ కొడితే మైండ్ షార్ప్‌గా పనిచేస్తుందని అంటారు. పొగ గుండెల్లోకి పోవడంతో కఫం తగ్గుందని, ఫలితంగా ఆస్తమా లాంటి వ్యాధులు తగ్గుతాయని మరికొందరు అంటారు. మెంథాల్ సిగరెట్లు దీనికి ఉదాహరణ అని, అవి తాగితే జలుబు తగ్గి, శ్వాస కాస్త తేలిక పడుతుందని చెబుతారు. అయితే ఇవన్నీ అపోహనలేనంటున్నారు వైద్యులు. ధూమపానం అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. 

ఇలా పొగబెడుతుంది..

ధూమపానం ప్రభావం నేరుగా శ్వాసకోశాలపై పడుతుంది. పొగ వల్ల అవి దెబ్బతింటాయి. గుండె జబ్బులు, జీర్ణకోశ వ్యాధులు కూడా ముప్పిరిగొంటాయి. దీనికితోడు కాసేపు పొగ లేకపోతే ఆందోళన, నిద్రలేమి, కోసం వంటివి వచ్చేస్తాయి. మెంథాల్ సిగరెట్లతో కలిగేది తాత్కాలిక ఉపశమనమేని, అందులో నికోటిక్ ఉంటుంది కనుక దీర్ఘకాలం వాడితే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఆస్తమా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ధూమపానం వల్ల కొంతమేర ఉపశమనం కలిగించిన మాట నిజమేనని, అయితే దాని ప్రభావం అప్పటికి మాత్రమే ఉండి, తర్వాత దుష్ర్పభావం చూపుతుందని వివరిస్తున్నారు. ఆస్తమా పెరిగిన తర్వాత సిగరెట్ వాడితే మరింత ఆయాసం రావడమే కాకుండా, ప్రాణాపాయం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ‘ధూమపానం వల్ల శ్వాసకోశాల్లోని పల్చని వెంట్రుకల్లా ఉండే సిలియ పొర దెబ్బతింటుంది. దీంత్యూ మ్యూకస్ మరిత పేరుకుపోతుంది. సిగరెట్ అలవాటు ఉన్న ఆస్తమా రోగులు ఆ అలవాటు మానుకోవడమే మంచిది. ఈ విషయంలో ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోవాలి. ధూమపానం తాగేవారికే కాకుండా చుట్టుపక్కల వారికి, కుటుంబ సభ్యులకు కూడా హానికరమే’ అని నిపుణులు చెబుతున్నారు.