ఈ చిన్నారి..కెనడా ప్రధాని..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ చిన్నారి..కెనడా ప్రధాని..!

May 26, 2017

ఐదేళ్ల చిన్నారి కెనడాకు ప్రధాని కాబోతోంది. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండేలా,అందరూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తానంటోంది. ఐదేళ్ల చిన్నారి కెనడాకు ప్రధాని ఏంటానుకుంటున్నారా..ఐతే వాచ్ దిస్ స్టోరీ
కెనడాకు చెందిన సీబీసీ కిడ్స్‌ ఎడ్యుకేషనల్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇటీవల ఓ కాంటెస్ట్‌ నిర్వహించింది. ‘పీఎం ఫర్‌ ఏ డే(ఒకరోజు ప్రధాని)’ పేరుతో జరిపిన ఈ కాంటెస్ట్‌లో థంప్సన్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి బెల్లా గెలిచింది. ఇంకేముంది దేశానికి ఒక రోజు ప్రధానిగా బెల్లా పనిచేయనుంది. కెనడా డే స్పెషల్‌ జులై 1న బెల్లా ప్రధానిగా కన్పిస్తుంది.
ఒట్టావాలోని పార్లమెంట్‌ కార్యాయంలో బెల్లాను కలిసిన ప్రధాని ట్రూడో.. ఆమెను అభినందించారు. అంతేగాక, బెల్లాతో కలిసి చిన్నపిల్లాడిలా మారిపోయి కాసేపు ఆడుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ బెల్లా ఏం చెప్పి.. ఈ కాంటెస్ట్‌లో గెలిచిందంటే.. ‘ఒక ప్రధానిగా.. పత్రిఒక్కరికీ ఇల్లు ఉండేలా, అందరూ సురక్షితంగా ఉండేలా చూస్తాను. ప్రతి ఒక్కరినీ నేను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటాను. మన చుట్టూ ఉండే జంతువులు, ప్రపంచం క్షేమంగా ఉండేలా పనిచేస్తాను. ప్రతి కెనడియన్‌ ఆరోగ్యంగా ఉండేలా చూస్తాను’అని విన్నర్ గా నిలిచింది.