కెనడా ప్రధాని నోట..జైహింద్..! - MicTv.in - Telugu News
mictv telugu

కెనడా ప్రధాని నోట..జైహింద్..!

August 22, 2017

మన దేశ సంసృతీ సాంప్రదాయాలను ప్రపంచంలోని చాలా దేశాల్లో గౌరవిస్తుంటారు. మనదేశంలో చాలామంది పాశ్చాత్య దేశాల సంస్కృతికి అలవాటు పడుతుంటే..విదేశీయులు మాత్రం మన కట్టుబొట్టును ముచ్చట పడి మరీ కట్టుకుంటున్నారు.

తాజాగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వాళ్ల దేశంలో జరిగిన ఇండియా డే పరేడ్ లో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించిన ట్రూడో భారతదేశ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు ఆ పరేడ్ లో  జైహింద్ అనే నినాదంతో అక్కడున్న వారందరిని  ఉత్తేజపరిచారు.

దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధం కొనసాగాలని ఆకాంక్షించారు. కెనడా ప్రధానిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకో దేశ ప్రధాని అయ్యిండి జైహింద్ అని భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాలను గౌరవించడం ఆయన సంస్కారానికి నిదర్శనం అని పొగుడుతూ ట్వీట్లు చేస్తున్నారు.