Canada to welcome 500000 immigrants per year by 2025
mictv telugu

ఇదే మా ఆహ్వానం.. కెనడా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్

November 2, 2022

Canada to welcome 500000 immigrants per year by 2025

తమ దేశంలో కార్మికుల కొరత తీవ్రంగా ఉందంటూ.. వేరే దేశాల నుంచి వలసదారులను ఆహ్వానిస్తోంది కెనడా. ఇప్పటికే ఈ సమస్యను కొరతను ఎదుర్కొంటున్న కెనడా 2025 నుంచి ప్రతియేటా 5లక్షల మందిని ఆహ్వానించాలని మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ మంగళవారం కొత్త ప్రణాళికను వెల్లడించారు. ప్రతియేటా అవసరమైన స్థాయిలో నైపుణ్యం గల కార్మికులను ఆహ్వానించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు సైతం బలం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.

గతేడాది 4.05లక్షల మంది విదేశీయులకు కెనడాలో ఆశ్రయం కల్పించగా.. 2023లో ఆ సంఖ్య 4.65లక్షలకు చేరే అవకాశం ఉందన్నారు. అందుకే 2025 నుంచి ప్రతియేటా 5లక్షల మంది విదేశీ కార్మికులను ఆహ్వానించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. కొత్తగా వచ్చిన వారి కోసం వివిధ రంగాలలో ఖాళీగా ఉన్న దాదాపు 10లక్షల ఉద్యోగాల్లో కొన్నింటిని భర్తీ చేస్తారని అన్నారు. దేశ శ్రామికశక్తి వృద్ధికి కారణమైన వలస కార్మికులను ఎట్టిపరిస్థితుల్లో వదులుకోమని తెలిపారు. కెనడా తీసుకున్న తాజా నిర్ణయం వల్ల మరింత మంది భారత ప్రవాసులు ఆ దేశానికి వెళ్లేందుకు మార్గం సుగమమైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.