భారత విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కెనడా ప్రభుత్వం..ఈ నిబంధనల్లో సడలింపులు.!! - MicTv.in - Telugu News
mictv telugu

భారత విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కెనడా ప్రభుత్వం..ఈ నిబంధనల్లో సడలింపులు.!!

January 17, 2023

Canadian government has given good news to Indian medical students

కెనడాకు వెళ్లాలని భావిస్తున్న భారతీయ వైద్యులకు శుభవార్త చెప్పింది కెనడా ప్రభుత్వం. విదేశీ వైద్యులు తమ దేశానికి వచ్చేందుకు కొన్ని వెసులుబాట్లను కల్పించబోతోంది కెనడా ప్రభుత్వం. విదేశీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్యులను ప్రాక్టీస్ చేయడానికి, లైసెన్స్‌ని పొందేందుకు అనుమతించే ప్రక్రియను సరిదిద్దడానికి సిద్ధంగా ఉంది  కెనడియన్ ప్రభుత్వం. ఇందుకోసం ముసాయిదాను కూడా సిద్ధం చేసింది.

 

మరింత ప్రయోజనం పొందనున్న భారత వైద్య విద్యార్థులు:

కెనడా తీసుకురానున్న కొత్త నిబంధనల్లో  విదేశీ స్పెషలిస్ట్ డాక్టర్లకు ప్రాక్టీస్ చేసే అనుభవాన్ని రెండు సంవత్సరాలకు తగ్గించనుంది.  ప్రస్తుతం ఇది 7 సంవత్సరాలు ఉంది. ఇది మాత్రమే కాదు, లైసెన్స్ మంజూరు ప్రక్రియను కూడా ప్రస్తుతం 5 సంవత్సరాల నుండి 3 నెలలకు తగ్గించాలని ప్రతిపాదించింది. కెనడాలో ప్రాక్టీస్ చేయడానికి సిద్ధంగా ఉన్న భారతీయ వైద్యులు ఈ కొత్త నియమం నుండి ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు. కెనడియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్ ప్రకారం, ప్రస్తుతం కెనడాలో 8,000 మంది భారతీయ వైద్యులు పనిచేస్తున్నారు. అంటే ప్రతి 10 మంది వైద్యులలో ఒకరు భారతీయుడు ఉన్నాడు. కెనడాలో నిపుణులైన వైద్యుల కొరత ఉండటంతో అక్కడి ప్రభుత్వం నిబంధనల్లో మార్పు చేస్తున్నట్లు సమాచారం.

 

కెనడాలో వైద్యుల కొరత:

Canadian government has given good news to Indian medical students

కెనడాలో ఈ మార్పుకు వైద్యుల కొరతే కారణమని చెబుతున్నాయి అక్కడి నివేదికలు. ప్రతి సంవత్సరం కెనడా నుండి 3,500 మందికి పైగా విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి ఐర్లాండ్, బ్రిటన్, అమెరికా వంటి దేశాలకు వెళుతున్నారు. US మినహా కెనడా వెలుపల మెడిసిన్ చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టీస్ చేయడానికి 7 సంవత్సరాల అనుభవం అవసరం అవుతుంది.  దీని కారణంగా చాలా మంది విద్యార్థులు అక్కడే ఉండి ప్రాక్టీస్‌ మొదలుపెడతాడు. కాగా కెనడాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే… 4 సంవత్సరాలు ఉండాలి. విదేశీ వైద్యుల రాకతో కెనడాలో వైద్యుల కొరత తీరుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.