ఉక్రెయిన్‌కు అండగా తుపాకీ వీరుడు.. రోజుకు 8 మందిని చంపేస్తాడు - MicTv.in - Telugu News
mictv telugu

ఉక్రెయిన్‌కు అండగా తుపాకీ వీరుడు.. రోజుకు 8 మందిని చంపేస్తాడు

March 12, 2022

rrr

ప్రపంచంలోనే అత్యుత్తమ షూటర్‌గా పేరుగాంచిన కెనడియన్ వాలి ఉక్రెయిన్‌కు అండగా, యుద్ధ రంగంలో ప్రవేశించాడు. రష్యాను ఎదిరించడానికి విదేశీయులకు మా సైన్యం తరపున పోరాడే అవకాశం ఇస్తానన్న జెలెన్‌స్కీ పిలుపు మేరకు తాను స్వచ్చందంగా ముందుకు వచ్చినట్టు మీడియాకు తెలిపారు. ‘ ఇక్కడి ప్రజలు యూరోపియన్‌లా ఉండాలనుకుంటున్నారు. రష్యన్‌లా కాదు. అందుకే ఈ యుద్ధం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వారికి నా సహాయం అవసరమనిపించింద’ని వెల్లడించాడు. భార్య, ఏడాది వయస్సున్న కుమారుడిని వదిలి వచ్చానంటూ వివరించారు. ఒక చేత్తో తుపాకి, మరో చేత్తో కెమెరా పట్టుకొని స్థానిక పరిసరాలను వీడియో చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పెడుతుంటాడు. కాగా, రోజుకు దాదాపు పది మందిని మట్టుబెట్టే సామర్ధ్యం గల వాలికి, ఇంతకు ముందు ఆఫ్ఘాన్ యుద్ధంలో పాల్గొన్న అనుభవం ఉంది.