ఇక ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి
డెబిట్ కార్డులేకుండానే ‘యోనో యాప్’ ద్వారా ఏటీఎం నుంచి నగదుడ్రా చేసుకునేందుకు ఎస్‌బీఐ సరికొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలోమరో జాతీయ బ్యాంకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది. కెనరా బ్యాంకు తమ ఖాతాదారుడి డబ్బు భద్రంగా ఉండేందుకు సరికొత్త నిబంధన తీసుకువచ్చింది. ఇక నుంచి ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసుకునే సమయంలో ఖాతాదారుడి ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే నగదు బయటకు వచ్చే ఏర్పాటు చేసింది.
ఒక రోజులో రూ.10వేలు ఆ పై మొత్తం నగదు తీసుకోవాలంటే ఖాతాదారుడి మొబైల్‌కు ఓటీపీని పంపించనున్నారు. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత నగదు తీసుకోవచ్చు. అనధికారిక లావాదేశీలు జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. ఖాతాదారుడి నగదు సురక్షితంగా ఉండటమే తమ లక్ష్యమని చెబుతున్నారు. ఇప్పటి వరకైతే కొంతమంది ఖాతాదారులకు మాత్రమే పరిమితం చేసేనప్పటికీ త్వరలోనే ఖాతాదారులందరికీ దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ. 10 వేల లోపు తీసుకునే వారికి మాత్రం మినహాయింపు ఇచ్చారు.