10వ తరగతి పరీక్షలు దండగ, రద్దు చెయ్యండి.. మంచు విష్ణు - MicTv.in - Telugu News
mictv telugu

10వ తరగతి పరీక్షలు దండగ, రద్దు చెయ్యండి.. మంచు విష్ణు

June 29, 2020

cancel tenth exams says actor manchu vishn

పదో తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలపై నటుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహించే విధానం పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘ఈ ఏడాదే కాకుండా పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయబడాలని నేను బలంగా కోరుకుంటున్నాను. 14, 15 ఏళ్ల వయసులో బోర్డు పరీక్షలు అంటూ విద్యార్థులపై ఒత్తిడి అవసరమా? ఈ పరీక్షల ఉద్దేశం ఏమిటి?’ అంటూ మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. 

ప్రస్తుతం మంచు విష్ణు చేసిన ట్వీట్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు విష్ణు అభి​ప్రాయంతో ఏకీభవిస్తున్నారు. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. గతంలో 7వ తరగతి విద్యార్థులకు కూడా బోర్డు పరీక్షలు ఉండేవని ఆ తర్వాత తీసేశారని కొందరు తెలిపారు. ఇక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేసిన సంగతి తెల్సిందే.