హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు మరో సారి రద్దయ్యాయి. పలు రూట్లలో మరమ్ముతులు కారణంగా మూడు రోజుల పాటు రైళ్ళను దక్షిణ మధ్య రై ల్వే రద్దు చేసింది. మొత్తం 19 ఎంఎంటీఎస్ సర్వీసులను ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
లింగంపల్లి –హైదరాబాద్ మార్గంలో రెండు సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లో మూడు, ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో ఐదు సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో ఆరు సర్వీసులు ,రద్దు చేశారు. రామచంద్రాపురం-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-రామచంద్రాపురం, ఫలక్‌నుమా-హైదరాబాద్ మార్గంలో ఒక్కో రైలు రద్దయ్యాయి.
ఇటీవల కాలంలో పలు మార్లు ఎంఎంటీఎస్ సేవలను నిలిపివేస్తునన్నారు. రేపటి నుంచి మరోమారు మూడు రోజులు పాటు బ్రేక్ వేశారు. ఈ రైళ్ల ద్వారా నిత్యం వేలాది ఉద్యోగులు, కార్మికులు, రోజు వారీ కూలీలు.. ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు వారు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే తాత్కాలికంగానే రైళ్లను రద్దు చేస్తున్నామని త్వరలో పూర్తిస్థాయిలో అందబాటులో ఉంటాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.