ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నా వద్దన్న క్యాన్సర్ పేషంట్.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నా వద్దన్న క్యాన్సర్ పేషంట్..

April 14, 2022

 

kkkkk

ఓ క్యాన్సర్ పేషంట్‌కు పిలిచి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని కోర్టు న్యాయమూర్తి ఆఫర్ చేసినా.. మీ ఉద్యోగం వద్దు, ఏమీ వద్దు మేం చేస్తున్న ఉద్యమానికి న్యాయం చేయండి చాలు అంటూ ఆ న్యాయమూర్తి ప్రతిపాదనను తిరస్కరించిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లో గతకొన్ని నెలలుగా ఉద్యోగాల కోసం ప్రజలు ధర్నాలో పాల్గొంటున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయంటూ వందలాది మంది నిరుద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు.

ఈ క్రమంలో బీర్బూమ్‌లోని నల్హటికి చెందిన సోమదాస్ కూడా ఉద్యమంలో పాల్గొంటున్నారు. అయితే, సోమదాసుకు క్యాన్సర్. అయినా దానిని పట్టించుకోకుండా తన ఉపాధ్యాయ పదవి కోసం పగలు, రాత్రి ఉద్యమిస్తున్నారు. న్యాయం కోరుతూ కోల్‌కతా వీధుల్లో ధర్నాకు కూర్చున్నారు. కోల్‌కతా హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఉపాధ్యాయురాలు, సోమదాస్ గురించి తెలుసుకున్నారు. అతను కోర్టులో కలవడానికి సోమదాసును పిలిచారు. న్యాయమూర్తి ఆమెను మీరు ఏదైనా ప్రభుత్వ శాఖలో పని చేయాలనుకుంటున్నారా? అందుకు నేను సిఫార్సు చేస్తానని ఆఫర్ ఇచ్చారు.

దానికి సోమదాస్ స్పందిస్తూ..”లేదు, టీచర్ కావాలనే నా కలను వదులుకోలేను. నాకు సానుభూతి ఉద్యోగం వద్దు. అవినీతిపైనే నా పోరాటం. దాని కోసమే పోరాడుతాను” అని తేల్చి చెప్పేసింది. దాంతో న్యాయమూర్తి మాట్లాడుతూ..’కోర్టు మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అవకాశం వస్తే, తప్పకుండా నీకూ చెబుతాను’ అంటూ ఆమెను అభినందించి పంపించేశారు.