Candidates .. As if there are no TET results today ..
mictv telugu

అభ్యర్థుల్లారా.. నేడు టెట్ ఫలితాలు లేనట్లే..

June 27, 2022

tet

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 12వ తేదీన టెట్ పరీక్ష ముగిసిన విషయం తెలిసిందే. ఈ టెట్ పరీక్ష ముగిసిన రోజు నుంచి నేటివరకు అభ్యర్థులు టెట్ ఫలితాలను అధికారులు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా? అని అత్రుతుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రోజునే టెట్ ఫలితాలను జూన్ 27న విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. కానీ, తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఈరోజు విడుదల కావాల్సిన ఫలితాలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ టెట్ ఫలితాల విడుదలకు సంబంధించి ఆదివారం వరకు అధికారులు ఏలాంటి ప్రకటన జారీ చేయలేదు.

తెలంగాణలో చాలా కాలం తర్వాత టెట్ నోటిఫికేషన్ మార్చి 24న రాగా, జూన్ 12న పరీక్ష జరిగింది. దీంతో టెట్ పరీక్షకు భారీ ఎత్తున అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటికే విడుదల చేసిన టెట్ కీ పేపర్ 1లో సమాధానాలపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.పేపర్ 2లో ఫైనల్ కీలో కూడా 5 సమాధానల్లో తప్పులు ఉన్నాయనే వాదన వినిపిస్తుంది. దీంతో వీటిపై ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఫలితాలను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే అభ్యర్థులు టెట్ ఫలితాలకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.