Candidates..BRAVO study materials at low cost
mictv telugu

అభ్యర్థుల్లారా..తక్కువ ధరకే బీఆర్ఏవోయూ స్టడీ మెటీరియల్స్

August 30, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్ఎవోయూ) పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. బీఆర్ఎవోయూ ఆధ్వర్యంలో రూపొందించిన పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్స్‌ను తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు సోమవారం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. విడుదల చేసిన ప్రకటనలో.. ఏ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి? పుస్తకాల ధర ఎంత? ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలి? అనే తదితర విషయాలను పేర్కొన్నారు.

”నాలుగు పుస్తకాలను విడుదల చేశాం. వాటి ధర రూ.1,150గా నిర్ణయించాం. సోమవారం నుంచే ఆన్‌లైన్‌లో బుకింగ్ ప్రారంభమైంది. తొలిరోజు 500 మంది అభ్యర్థులు బుక్ చేసుకొన్నారు. మొత్తం 2,200 పేజీలు ఉన్నాయి. తొలివిడతగా 20 వేల పుస్తకాలను ముద్రించాం. వాటిలో కొన్ని పుస్తకాలను ఆయా గ్రంథాలయాలకు అందించగా, మరికొన్నింటిని వర్సిటీలోనే విక్రయిస్తున్నాం. బీఏ, ఎంఏ పుస్తకాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. వీటిని మార్కెట్లో విక్రయించం. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు మాత్రమే అందజేస్తాం. ఈ పుస్తకాలు సివిలకు పోటీపడే అభ్యర్థులకు ఉపయోగపడుతాయి” అని అధికారులు తెలిపారు.

పుస్తకాలు ఇవే..
1. తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవతరణ
2. ఆర్థిక వ్యవస్థ – అభివృద్ధి
3. భారత సమాజం – రాజ్యాంగ పరిపాలన
4. భారతదేశ చరిత్ర – సంస్కృతి

బుకింగ్ ఇలా..

మెటీరియల్ కావాలనుకొనే అభ్యర్థులు www.braouonline.inలో పేమెంట్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన పేమెంట్ రశీదుతో వర్సిటీకి వెళ్లి, మెటీరి యల్ పొందవచ్చు. పోస్టు ద్వారా పొందాలనుకొనేవారు https://www.braouonline.in/booksale/servi cesbooks.aspxను సంప్రదించాలి. కాగా, వర్సిటీ కౌంటర్లో డబ్బులు చెల్లించి వెంటనే మెటీరియల్ పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యా ర్డులు ఆన్లైన్లో బుక్ చేసుకొంటే, పోస్టు ద్వారా ఇంటికి పంపిస్తామని వర్సిటీ అధికారులు వెల్లడించారు.