అభ్యర్థుల్లారా.. ఎస్సై ప్రిలిమినరీ తేదీలో మార్పు? - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థుల్లారా.. ఎస్సై ప్రిలిమినరీ తేదీలో మార్పు?

May 31, 2022

తెలంగాణ రాష్ట్రంలో గత నెలలో వెలువడిన పోలీసు ఉద్యోగాలకు తాజాగా గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఓ ప్రభుత్వ అధికారి ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీ మారే అవకాశాలు ఉన్నాయని సూచించారు. త్వరలోనే ఈ పరీక్షకు సంబంధించి రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి కొత్త తేదీని ప్రకటించనున్నట్లు ఆ అధికారి తెలిపారు.

ఎందుకు? ఈ ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష తేదీని మార్చనున్నారు అంటే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనా బీఎస్‌ఎఫ్, సీఆర్‌ఫీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌సీ తదితర పారామిలటరీ బలగాల్లో 250 పోస్టుల భర్తీకి ఏప్రిల్‌లో యూపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఆగస్టు 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 15 కేంద్రాల్లో రాత పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి 10 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. దీంతో ఎస్సై ప్రిలిమినరీని పరీక్ష తేదీని మార్చాలంటూ తెలంగాణ పోలీసు నియమాక మండలికి అభ్యర్థులు ట్విటర్‌ వేదికగా వినతుల మీద వినతులను పంపిస్తున్నారు. త్వరలోనే ఈ పరీక్ష తేదీని మార్చి, ప్రకటన విడుదల చేయనున్నారని ఆ అధికారి పేర్కొన్నారు.

మరోపక్క తెలంగాణలో ఎస్సై ప్రిలిమినరీ ఆగస్టు 7న, కానిస్టేబుల్ రాత పరీక్ష అదే నెల 21న నిర్వహిస్తామని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే అధికారులు కసరత్తులు ప్రారంభించారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాత పరీక్షల తేదీలు ఖారారు కావడంతో ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీని మార్చనున్నట్లు సమాచారం.