Candidates: Constable exam tomorrow..These are the rules to be followed..
mictv telugu

అభ్యర్థుల్లారా: నేడే కానిస్టేబుల్ పరీక్ష..రూల్స్ ఇవే..

August 27, 2022

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 28న (ఆదివారం) కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇదివరకే రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి అధికారులు పూర్తి చేశారు. శనివారం రాత్రితో హాల్ టికెట్ల గడువు కూడా ముగిసింది. అయితే, ఆదివారం జరగబోయే ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అభ్యర్థులు తప్పకుండా పాటించాల్సిన కొన్ని నియమ, నిబంధనలను అధికారులు సూచించారు.

రూల్స్ ఇవే..
1. గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు.
2. ‘నిమిషం ఆలస్యమైన అభ్యర్థుల్ని అనమతించరు.
3.www.tslprb.in నుంచి హాల్ టికెట్‌ను ఏ4 సైజ్ పేపర్‌లో డౌన్లోడ్ చేసుకోవాలి.
4. ఆ తర్వాత నిర్దేశిత స్థలంలో అభ్యర్థి ఫొటోను అతికించుకోవాలి.
5.ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్స్ కొట్టొద్దు. ఫొటో లేకుంటే పరీక్షకు అనుమతించరు.
6. బయోమెట్రిక్ విధానం ఉంటుంది కాబట్టి అభ్యర్థుల చేతులకు మెహిందీ, టాటూలు ఉంచుకోకూడదు.
7. పరీక్షకు బ్లూ పెన్ లేదా బ్లాక్ పెన్ అయిన సరే.

ఇక, పరీక్ష అర్హత విషయానికొస్తే..ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ఎస్సీ/ఎస్టీలు 30శాతం, బీసీలు 35 శాతం, ఇతరులు 40 శాతం కనీస మార్కులు సాధిస్తేనే, అర్సులుగా పరిగణించేవారు. ఈసారి సామాజికవర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ 30 శాతం కనీస మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు. అంటే 60 మార్కులు వస్తే సరిపోతుంది. నెగెటివ్ మార్కులు ఉంటాయి. అయిదు తప్పు సమాధానాలకు ఒక మార్కు తగ్గిస్తారు. ఇక్కడ అర్హత సాధిస్తే తదుపరి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరు కావొచ్చు. ఇది గట్టెక్కితే తుది రాతపరీక్ష ఉండనుంది. ఆ పరీక్షలో మాత్రం నెగెటివ్ మార్కులుండవని అధికారులు పేర్కొన్నారు.