అభ్యర్థుల్లారా.. వక్రమార్గం వద్దు - నిజాయితే ముద్దు - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థుల్లారా.. వక్రమార్గం వద్దు – నిజాయితే ముద్దు

May 2, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే విడుదలైన పోలీస్ ఉద్యోగాలకు, గ్రూప్ 1 ఉద్యోగాలకు ఈరోజు నుంచే దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం అభ్యర్థులను హెచ్చరించింది. ఎలాగైనా ఈసారి ఉద్యోగాన్ని సంపాధించాలనే ప్రయత్నంలో అభ్యర్థులు వక్రమార్గాలను ఎంచుకోవద్దని అధికారులు హెచ్చరించారు. నిజాయితీగా కష్టపడి చదివి, ఉద్యోగాన్ని సాధించాలని కోరారు.

పోలీస్ అధికారులు మాట్లాడుతూ..”గతంలో పోలీసు ఉద్యోగాల విషయంలో కొంతమంది అభ్యర్థులు తేలివిగా ఒకరికి బదులు మరోకరు పరీక్ష రాసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరికొందరు తమతోపాటు మంచి ప్రతిభ ఉన్న మరో వ్యక్తిని ఉద్యోగానికి దరఖాస్తు, చేయించి, ఇద్దరి హల్‌టికెట్ నంబర్లు పక్క పక్కనే వచ్చేలా ప్లాన్ చేసుకొని, జవాబు పత్రంపై అసలు అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్‌ను వేయకుండా అతని తరపున దరఖాస్తు చేసిన మరోవ్యక్తి వ్యక్తి నెంబర్ వేసి పరీక్ష రాశారు. తద్వారా రాత పరీక్షలో మెరుగైన మార్కులు సాధించే ప్రయత్నం చేశారు. కావున ఈసారి అలాంటి ఆలోచనలు ఉంటే, ఇప్పుడే మానుకోండి. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం.

ఇంకొంతమంది అభ్యర్థులు మాజీ సైనికుల కోటాలో హూంగార్డులుగా విధులు నిర్వహిస్తూ, అక్రమాలకు పాల్పడగా అధికారులకు అనుమానం వచ్చి వారిని పిలిచి ప్రశ్నిస్తే, పొరపాటుగా ఆ కోటా ఎంచుకున్నామని సమాధాను చెప్పారు. కానీ, కావాలనే వారంతా మాజీ సైనికుల కోటాలో దరఖాస్తు చేసుకున్నారని విచారణలో తేలింది.

గతంలో నల్గొండ జిల్లాలో ఒకరికి బదులు మరోకరు దేహదారుడ్య పరీక్షలకు హాజరయ్యారు. అలాగే, హైదరాబా‌ద్‌లోని ఓ ఎంపిక కేంద్రం వద్ద అభ్యర్థి అర్హత సాధించకపోయిన, అర్హత సాధించినట్లు కంప్యూటర్లో తప్పుగా నమోదు చేశారు. ఈసారి గతంలో జరిగిన పొరపాట్లు ఇప్పుడు జరగకుండా చాలా కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. కావున అభ్యర్థులు తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే కఠినంగా శిక్షిస్తాం. వక్ర బుద్దిని వదిలి- నిజాయితీ మార్గాన్ని ఎంచుకోండి” అని అధికారులు కోరారు.