Candidates: Don't worry, we will evaluate it even if you don't write it
mictv telugu

అభ్యర్థుల్లారా: ఆందోళన చెందకండి, అలా రాయకున్నా మూల్యాంకనం చేస్తాం

August 29, 2022

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం రోజున కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్షకు ముందే అధికారులు.. ‘నిమిషం నిబంధన’ అమలు చేయడంతో ఉదయం కేంద్రాల వద్ద అభ్యర్థుల హడావుడి కనిపించింది. కొన్నిచోట్ల అభ్యర్థులు ఆలస్యంగా పరీక్ష హాల్‌కు రావడంతో, అధికారులు వారిని తిరిగి పంపించేశారు. అయితే, పరీక్షలో ‘సి’ సిరీస్ ఓఎంఆర్ షీట్లో దొర్లిన ఓ పొరపాటు వల్ల అభ్యర్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తమ పేపర్ మూల్యాంకనం అవుతుందా లేదా అని అయోమాయంలో పడ్డారు.

ఈ పొరపాటుపై ఉన్నతాధికారి వి.వి. శ్రీనివాస రావు స్పష్టతనిచ్చారు. పరీక్షలో ‘సి’ సిరీస్ ఓఎంఆర్ షీట్స్ వచ్చిన అభ్యర్థులు ఏలాంటి ఆందోళన చెందకండి. సాధారణంగా ఓఎంఆర్ షీలో ప్రశ్నపత్రం బుక్ కోడ్ బబుల్ చేసేందుకు 1-5 సంఖ్యలే ఉంటాయి. కోడ్‌ని బట్టి ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాలి. కానీ ‘సి’ సిరీస్ ప్రశ్నపత్రం బుక్ కోడ్లో ‘6″ సంఖ్య ఉంది. ఓఎంఆర్‌లోలేని ‘6’ను ఎలా బబ్లింగ్ చేయాలని అభ్యర్థులు పలు సందేహాలను వ్యక్తం చేశారు. బుక్ కోడ్ అనేది కేవలం నిర్దారణ కోసమే. అది సరిగా రాయకున్నా అభ్యర్థులు ఆందోళన చెందనవసరం లేదు. వాటన్నింటినీ మూల్యాంకనం చేస్తాం” అని ఆయన అన్నారు.

ఇక, పోలీస్ ఉద్యోగాల విషయానికొస్తే.. సివిల్ విభాగంలో 15,644, ఆబ్కారీ శాఖలో 814 రవాణాశాఖలో 83 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులు చేసుకున్నారు. ఇందులో మొత్తం 6,03,855691.84 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. వికారాబాద్-1 ప్రాంతీయ కేంద్రంలో అత్యధికంగా 97. 41 శాతం, మేడ్చల్-5 కేంద్రంలో అత్యల్పంగా 82.27శాతం హాజరు నమోదైంది.

త్వరలోనే తుది కీ విడుదల..
ఆదివారం జరిగిన కానిస్టేబుల్ పరీక్ష తుది కీ సంబంధించి, అధికారులు మాట్లాడుతూ..మరో రెండు, మూడు రోజుల్లో ప్రిలిమినరీ కీని విడుదల చేస్తామని అన్నారు. కావున తుది కీ విడుదలైన వెంటనే అభ్యర్థులు..అధికారిక వెబ్‌సైట్ www.tslprb.inలో చూసుకోవాలని తెలిపారు.