అభ్యర్థుల్లారా.. ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్.. - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థుల్లారా.. ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్..

May 14, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే విడుదలైన పోలీసులు ఉద్యోగాలకు సంబంధించి అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియలో తొలుత నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలను ఆగస్టులోనే నిర్వహిస్తామని ఇదివరకే అధికారులు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో తాజా విషయాన్ని తెలిపారు.

”ఆగస్టు ఏడోవ తేదీన ఎస్సై ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. రెండు వారాల వ్యవధిలోనే అంటే ఆగస్టు 21న కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని సన్నహాలు చేస్తున్నాం. పోలీస్, ఫైర్, జైళ్ల శాఖ, ఎక్సైజ్, రోడ్డు రవాణా శాఖల్లో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 17,291 పోస్టుల భర్తీకి టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆల్‌లైన్‌లో ఇంకా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నది. దరఖాస్తుల చివరి తేదీ ఈనెల 20తో ముగుస్తుంది. ఆ తర్వాత అభ్యర్థుల వివరాలను సరిచూసి, అర్హులైన అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్ టికెట్లను జారీ చేస్తాం. ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థులకు 200 మార్కులకు గాను 30శాతం మార్కులు వస్తే, అర్హత సాధించినట్లు, ఎవరైతే 30 శాతం మార్కులు దాటుతారో ఆ అభ్యర్థులు తర్వాతి పరీక్షలకు అర్హులు అవుతారు”