అభ్యర్థుల్లారా.. అన్ని కుదిరితే ఆన్‌లైన్‌లోనే పరీక్ష.. - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థుల్లారా.. అన్ని కుదిరితే ఆన్‌లైన్‌లోనే పరీక్ష..

May 24, 2022

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వెలువడిన 503 గ్రూప్ -1 ఉద్యోగాలకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రిలిమ్స్ పరీక్షను ఎప్పటిలాగే ఆబ్జెక్టివ్ టైపులో నిర్వహించి, అన్నీ సక్రమంగా కుదిరితే మెయిన్స్ పరీక్షను ఆన్‌లైన్‌లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థికి కేటాయించిన ఐడీని ఎంటర్ చేస్తే క్వశ్చన్ పేపర్ సిస్టంలో డిస్‌ప్లే అయ్యేలా సన్నహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అధికారులు ఈ ఏర్పాట్లకు సంబంధించి సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. పలు విషయాలపై చర్చించి వివరాలను వెల్లడించారు.”ఇన్విజిలెటర్ ఇచ్చిన ఆన్సర్ షీట్‌లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మూడంచెల విధానంలో ఒక్కో ఆన్సర్ షీట్‌ను వాల్యూయేషన్ చేస్తారు. మూల్యాంకణం చేసిన ఆన్సర్ షీట్‌ను మళ్లీ ఆన్లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. కాగిత రహిత ప్రశ్నాపత్రం రెడీ చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నది” అని అధికారులు తెలిపారు.

మరోపక్క దాదాపు 11 ఏండ్ల తర్వాత తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ -1 పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రిలిమినరీకి లక్షల సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశం ఉండటంతో.. మెయిన్ను మాత్రమే ఈ క్వశ్చన్ పేపర్ విధానం అమలు చేసే యోచనలో ఉన్నారు. అమలు, నిర్వహణపై రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి సలహాలు సైతం తీసుకుంటున్నారు. రైల్వే రిక్రూట్ మెంట్‌లో ప్రస్తుతం ఆన్లైన్ విధానాన్ని అవలంబిస్తున్నారు. ప్రిలిమ్స్ అబ్జెక్టివ్ తరహాలోనే ఉండనుంది. ఆ తర్వాత మెయిన్ను ఎంపికయ్యేది 25,150 మంది మాత్రమే. 1:50 మేర మెయిన్‌కు ఎంపికవుతారు.