అభ్యర్థుల్లారా.. 40 కేంద్రాల్లో పోలీసు పరీక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థుల్లారా.. 40 కేంద్రాల్లో పోలీసు పరీక్షలు

May 30, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమ్స్ పరీక్షలను 40కి పైగా కేంద్రాల్లో నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. పరీక్షలకు సంబంధించి అధికారులు.. గతకొన్ని రోజులుగా కేంద్రాల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు.

ఈ క్రమంలో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలోని పాఠశాలల్లో చాలా వరకు సరైన సౌకర్యాల లేవని, కనీసం బల్లలు, బెంచీలు కూడా లేని పరిస్థితి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల అభ్యర్థులకు పక్క జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలని పోలీసు నియమాక మండలి నిర్ణయించింది. “పార్ట్-1 దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు రెండు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇచ్చాం. అందులో పేర్కొన్న కేంద్రాలకు ప్రాధాన్యమిస్తాం. ఈసారి అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. అందుకే జిల్లా కేంద్రాలతోపాటు సమీపంలోని పట్టణాల్లోనూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం” అని అధికారులు తెలిపారు.

ఇక, 2018వ సంవత్సరంలో ఎస్సై పోస్టులకు 180 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి 250 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని అధికారులు తాజాగా ప్రకటించారు. ఇటీవలే పోలీసు దరఖాస్తులకు గడువు ముగియడంతో అధికారులు పోలీసు ఉద్యోగాలకు ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారు. ఏఏ జిల్లాల్లో అధికంగా పోటీ ఉంది. మహిళలు ఎంత శాతం ఉన్నారు అనే పూర్తి వివరాలను వెల్లడించారు.

గతంలో కంటే 10 వేల దరఖాస్తులు ఈసారి ఆదనంగా వచ్చాయి. వీరిలో 50 వేల మంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కేంద్రాలకు ఆప్షన్ పెట్టారు. మిగతా 20 వేల మంది ఇతర జిల్లాలను ఎంచుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.