అభ్యర్థుల్లారా.. ఈ నెల 27న ఫలితాలు విడుదల - Telugu News - Mic tv
mictv telugu

అభ్యర్థుల్లారా.. ఈ నెల 27న ఫలితాలు విడుదల

June 13, 2022

తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులకు అధికారులు ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. టెట్ పరీక్ష ఫలితాలను జూన్ 27న విడుదల చేస్తామని కన్వీనర్ రాధారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అనంతరం కన్వీనర్ రాధారెడ్డి మాట్లాడుతూ..”టెట్ పరీక్షకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు చోటుచేసుకోలేదు. ఈ పరీక్షకు మొత్తం 6,29,382 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 5,69,576ల మంది హాజరయ్యారు. పేపర్ 1 పరీక్షకు బీఎడ్ అభ్యర్థులను కూడా అనుమతించడంతో 3,51,482ల మంది దరఖాస్తు చేసుకున్నారు. 3,18,506ల మంది హాజరయ్యారు. అంటే దాదాపు 90.62 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక, రెండో పేపరు 2,77,900ల మంది దరఖాస్తు చేసుకోగా, 2,51,050ల మంది పరీక్ష రాశారు” అని ఆయన అన్నారు.

మరోవైపు పరీక్షకు సంబంధించి అధికారులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నాపత్రాలను ఓపెన్ చేశారు. అనంతరం అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలను అందజేశారు. ఈ క్రమంలో టెట్ పరీక్ష ఫలితాలకు సంబంధించి, ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.