అభ్యర్థుల్లారా.. ఇదే గ్రూప్-1 సిలబస్ - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థుల్లారా.. ఇదే గ్రూప్-1 సిలబస్

April 27, 2022

తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా గ్రూప్-1 నోటిఫికేషన్ మంగళవారం అధికారులు విడుదల చేశారు. నోటిఫికేషన్‌లో మొత్తం 503 పోస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 సిలబస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం..

ప్రిలిమినరీ పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిను పరీక్షకు ఎంపిక చేస్తారు. ప్రధాన పరీక్షలో ఆరు పేపర్లు ఉంటాయి. 900 మార్కులు కేటాయించారు. మెయిన్స్‌లో 150 మార్కులకుండే ఇంగ్లిష్ పేపర్‌లో అర్హత సాధిస్తే సరిపోతుంది. తుది ఎంపికలో ప్రిలిమినరీ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.

Candidates .. Same Group-1 Syllabus

ప్రధాన పరీక్ష..
జనరల్ ఇంగ్లిష్ (అర్హత పరీక్ష) 3 గంటలు – 150 మార్కులకు ఉంటుంది.
పేపర్-1 జనరల్ ఎస్సే 8 గంటలు – 150 మార్కులకు ఉంటుంది.
1. సామాజిక సమస్యలు, అంశాలు
2. ఆర్థికాభివృద్ధి, న్యాయం
3. భారత రాజకీయాలు, మార్పులు
4. భారత చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
5. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి
6. విద్య మానవ వనరుల అభివృద్ది

పేపర్-2.. 3 గంటలు – 150 మార్కులు
చరిత్ర, సంస్కృతి, భౌగోళికశాస్త్రం
1. 1757-1947 వరకు భారత దేశ చరిత్ర, సంస్కృతి
2. తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
3. భారత దేశ, తెలంగాణ భౌగోళిక స్వరూపం

పేపర్-3..3 గంటలు – 150 మార్కులు
భారతదేశ సమాజం, రాజ్యాంగం, పరిపాలన
1. భారత దేశ సమాజం, ఆకృతి, సమస్యలు, సామాజిక ఉద్యమాలు
2. భారత రాజ్యాంగం
3. పరిపాలన

పేపర్-4.. 3 గంటలు – 150 మార్కులు
ఆర్థికశాస్త్రం, అభివృద్ధి
1. భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి
3. పర్యావరణ సమస్యలు

పేపర్-5.. 3 గంటలు – 150 మార్కులు
సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ ప్రెటేషన్
1. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాముఖ్యత, ప్రభావం
2. సైన్స్ విజ్ఞానంలో ఆధునికత వినియోగం
3. డేటా ఇంటర్ ప్రెటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్

పేపర్-6..-3 గంటలు – 150 మార్కులు
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం
1. తెలంగాణ ఆలోచన (1948-1970)
2. సమీకరణ దశ (1971-1990)
3. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991-2014)