తెలంగాణ వ్యాప్తంగా రేపు (ఆదివారం) టెట్ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి శనివారం అధికారులు పలు కీలక అంశాలను తెలియజేశారు. టెట్ పరీక్షకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని, పేపర్–1కు 3,51,468 మంది, పేపర్–2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
”టెట్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశాం. అత్యధికంగా హైదరాబాద్‌లోనే 212 కేంద్రాలు ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌లో మొత్తం 50,600 మంది ఈ పరీక్ష రాస్తున్నారు. ములుగులో అతి తక్కువగా 15 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అందులో 2,200 మంది పరీక్ష రాయనున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాం. అన్ని చోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. ఇంటర్నెట్ ద్వారా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశాం. ప్రశ్నప త్రం ఓపెన్ చేయడం మొదలుకొని, ప్యాక్ చేసే వరకూ వీడియో రికార్డింగ్ చేస్తాం” అని ఉన్నతాధికారులు తెలిపారు.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు..
1. టెట్ పరీక్ష పేపర్–1 ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది.
2. పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.
3. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
4. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించాం.
5. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు హాలులోకి అనుమతించాం.
6. ముందే పరీక్షా కేంద్రంలో సూచించిన ప్రదేశంలో వాటిని భద్రపర్చుకోవాలి.
7. ఓఎంఆర్ షీట్‌పై సర్కిల్స్ నింపేందుకు బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి.
8. ఓఎంఆర్ షీట్‌ను ముడవడం, చించడం చేయకూడదు.
9. దీనివల్ల కంప్యూటర్ మార్కులను తీసుకునే అవకాశం ఉండదు.
10. హాల్ టికెట్లపై అభ్యర్థి, అధికారుల సంతకం, అభ్యర్థి ఫొటో లేకపోతే గెజిటెడ్ అధికారి సమ క్షంలో ఫొటో అంటించి, ధ్రువీకరణ తీసుకుని, డీఈవో ద్వారా అనుమతిపొందాలి.