Candidates: SSC Results in September..Final 'Key' in 2 Days
mictv telugu

అభ్యర్థుల్లారా: సెప్టెంబర్‌లో ఎస్సై ఫలితాలు..2 రోజుల్లో తుది ‘కీ’

August 8, 2022

తెలంగాణ రాష్ట్రంలో గతకొన్ని నెలల క్రితం పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు రాత్రి, పగలు తేడా లేకుండా ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల కోసం సన్నద్దమవుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రోజున రాష్టవ్యాప్తంగా 503 పరీక్ష కేంద్రాల్లో ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు.

ఈ పరీక్షకు సంబంధించి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి అధికారులు అభ్యర్థులకు మరో తాజా విషయాన్ని వెల్లడించారు. ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సెప్టెంబరులో వెలువరిస్తామని, మరో రెండు లేదా మూడు రోజుల్లో ఎస్సై ప్రిలిమినరీ ప్రశ్నాపత్రం ‘కీ’ని విడుదల చేస్తామని పేర్కొన్నారు.

”తెలంగాణలో ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ హైదరాబాతోపాటు మరో 35 పట్టణాల్లో ఈ పరీక్షను నిర్వహించాం. పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 225,759 మంది (91.32 శాతం) హాజరయ్యారు. ఈనెల 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ జరగనుంది. అయితే, ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను సెప్టెంబర్‌లో వెల్లడించాలని, ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన తుది ‘కీ’ని రెండు లేదా మూడు రోజుల్లో ఇవ్వాలని నిర్ణయించాం. అక్టోబరులో శారీరక సామర్థ్య పరీక్షలను నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నాం. ప్రాథమిక రాత పరీక్షలో అర్హులైన అభ్యర్థులకు అక్టోబరు రెండో వారం నుంచి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(పీఈటీ) పరీక్షలను నిర్వహించేందుకు పోలీసు మైదానాలు, ఇతర క్రీడా ప్రాంగణాలపై దృష్టి పెట్టాం” అని అధికారులు తెలిపారు.