అభ్యర్థుల్లారా..టెట్ పరీక్ష వాయిదా పడదు: సబిత ఇంద్రారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థుల్లారా..టెట్ పరీక్ష వాయిదా పడదు: సబిత ఇంద్రారెడ్డి

May 21, 2022

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 12న నిర్వహించబోయే టెట్ పరీక్షకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాసేపటి క్రితమే ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..”జూన్ 12వ తేదీన కచ్చితంగా టెట్ పరీక్ష జరుగుతుంది. కొంతమంది అభ్యర్థులు టెట్ పరీక్షను వాయిదా వేయాలని కేటీఆర్‌కు ట్విటర్ వేదికగా విజ్జప్తి చేశారు. కేటీఆర్ ఆ ట్విట్స్‌ను నాకు ఫార్వర్డ్ చేశారు. టెట్ పరీక్ష వాయిదా వేయడం కుదరదు. అభ్యర్థులు అపోహలు వీడండి. తెలంగాణలో టెట్ పరీక్ష ఎట్టి పరిస్థితిలో వాయిదా వేయం. కచ్చితంగా పరీక్షను నిర్వహించే తీరుతాం. ఇప్పటికే పరీక్ష సంబందించిన అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాం” అని ఆమె అన్నారు.

మరోపక్క టెట్ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్ల విషయాన్ని కూడా అధికారులు తెలిపారు. జూన్ 6వ తేదీ నుంచి టెట్ హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కావున విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి, పరీక్షకు సిద్ధం కావాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.