Candidates .. Tet Hall tickets from June 6
mictv telugu

అభ్యర్థుల్లారా.. జూన్ 6 నుంచే టెట్ హాల్‌‌ టికెట్లు

May 21, 2022

Candidates .. Tet Hall tickets from June 6

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెట్‌ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. జూన్ 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే టెట్‌ పరీక్షకు సంబంధించి ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని, జూన్ 6వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌‌ టికెట్లను వెబ్‌సైట్‌ను నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

అధికారులు మాట్లాడుతూ..” టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు పరీక్షా కేంద్రాల ఎంపిక పూర్తయింది. 33 జిల్లాల్లోనూ అభ్యర్థుల సంఖ్యకు అనుగుణం గాసెంటర్లను అలాట్ చేశాం. అత్యధికంగా హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సెంటర్లు ఏర్పాటు చేశాం. టెట్ పరీక్ష వచ్చే నెల 12న జరగనుంది. ఈ పరీక్షకు మొత్తం 6,29,352 అప్లికేషన్లు అందాయి. వీటిలో పేపర్ 1కు 3.51,468, పేపర్ 2కు 2,77,884 మంది దరఖాస్తు చేశారు. జూన్ 6 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ ఎగ్జామ్‌ను ఐదేండ్ల తర్వాత పెట్టడంతో ఈసారి బీఈడీ అభ్యర్థులకు పేపర్ 1 రాసేందుకు అవకాశమిచ్చాం. ఈ కారణంగా భారీగా అప్లికేషన్లు వచ్చాయి” అని అన్నారు.

ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి అధికారులు కేవలం గడువు మూడు వారాలే గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవడంతో ఎగ్జామ్ సెంటర్ల ఎంపిక అధికారులకు పెను సవాల్‌గా మారింది. ముందుగా జిల్లాల ఇండెంట్‌ను మళ్లీ మార్చి, కొత్తగా సెంటర్లు పెంచాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తంగా స్టేట్ వైడ్‌గా పేపర్ 1కు 1,480 సెంటర్లు, పేపర్ 2కు 1,171 సెంటర్లను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు.