తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు వెల్లడైన తర్వాత, టెట్ పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్లో పెడతారా? లేదా? అంటూ హైదరాబాద్‌లో ఉన్న టెట్ కార్యాలయం వద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చ జరిపిన అధికారులు..అభ్యర్థులకు మరో తాజా విషయాన్ని గురువారం వెల్లడించారు. టెట్ పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లను అధికారిక వెబ్సైట్లో ఉంచామని, ఓఎంఆర్ షీట్లు కావాల్సిన అభ్యర్థులు రూ. 15 ఫీజు చెల్లించి, డౌన్లోడు చేసుకోవాలని తెలిపారు.
”టెట్ ఓఎంఆర్ పత్రాలను గురువారం ఎస్సీఈఆర్టీ అధికారిక వెబ్సైట్లో ఉంచాం. వాటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ. 15 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల టెట్ ఫలితాలు ఇవ్వగా, తుది కీ తర్వాత మాకు ఆశించిన మార్కులు రాలేదని, ఆ ప్రకారం మార్కులు ఇవ్వలేదని కొందరు ఫిర్యాదు చేశారు. వారి అభ్యర్థన మేరకు టెట్ ఓఎంఆర్ షీట్లను గురువారం రాత్రే వెబ్సైట్లో ఉంచాం.”
మరోపక్క తెలంగాణలో దాదాపు ఐదేండ్ల తర్వాత జూన్ 12న టెట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈసారి పేపర్1కు 3,18,444 మంది, పేపర్ 2కు 2,50,897 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వెల్లడైన టెట్ ఫలితాల్లో పేపర్ 1లో 1,04,078 (32.68%) మంది, పేపర్ 2లో 1,24,535 (49.64%) మంది అర్హత సాధించారు. కానీ, కొంతమంది అభ్యర్థులు రిజల్ట్స్‌లో తమ అంచనాలు తారుమారు అయ్యాయని, క్వాలిఫై అయిన తక్కువ మార్కులు వచ్చాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.