Candidates..the 'key' has been released..this is the link
mictv telugu

కానిస్టేబుల్ ‘కీ’ విడుదలైంది..లింక్ ఇదే

August 30, 2022

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 28వ తేదీన జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి, అధికారులు కాసేపటిక్రితమే ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ తుది ‘కీ’ ని విడుదల చేశామని, పరీక్షను రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్..https://www.tslprb.in/లో చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

”కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ‘కీ’ విడుదలైంది. ఈ ‘కీ’ని పోలీసు నియామక మండలి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచాం. కీ పేపర్‌లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపండి. ఈ నెల 31న ఉదయం 8గంటల నుంచి సెప్టెంబరు 2వ తేదీ 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాం. అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలకు విడివిడిగా తగిన ఆధారాలను వెబ్‌సైట్లో అప్లోడ్ చేయాలి” అని పోలీసు నియామక మండలి సూచించింది.

ఇక, పోస్టుల విషయానికొస్తే.. పోలీస్ సివిల్ విభాగంలో 15,644, ఆబ్కారీశాఖలో 614, రవాణాశాఖలో 63 కానిస్టేబుల్ పోస్టుల కోసం 1,601 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. హైదరాబాద్‌తోపాటు మరో 38 పట్టణాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగింది. మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులకు గాను 6,03,955 (91.34శాతం) మంది హాజరయ్యారు.