అభ్యర్థుల్లారా..పోటీ పరీక్షల బెస్ట్ యాప్స్ ఇవే..
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ, ఆయా శాఖల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుపేద, ధనిక అభ్యర్థులకు పలు యాప్స్ శుభవార్తను చెప్పాయి. కేవలం తమ యాప్స్ పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, అభ్యర్థులకు ఉచితంగా బెస్ట్ టీచింగ్, బెస్ట్ మేటీరియల్స్‌ను అందించటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నాయి. ముఖ్యంగా బ్యాంక్ జాబ్స్, పోలీసు ఉద్యోగాలు, గ్రూప్స్ ఉద్యోగాలతోపాటు అన్నీ రకాల ఉద్యోగాలకు సంబంధించి, మేటీరియల్స్‌ను రెడీ చేశామని తెలిపాయి.
దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగుల కోసం ఈ యాప్‌లను తయారుచేసి, కోచింగ్‌తోపాటు మాక్ టెస్టులు, లైవ్ క్లాసులను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపాయి.
1. మాకర్స్ యాప్..
ఈ యాప్.. ప్రధానంగా మాక్ టెస్టులు రాయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ఎస్ఎస్‌సీ, రైల్వేస్, బ్యాంకింగ్, టీచింగ్, డిఫెన్స్, సివిల్ సర్వీసెస్, పోలీస్, ఇంజినీరింగ్, ఇతర కేంద్ర, రాష్ట్రస్థాయుల్లో 60కి పైగా పరీక్షలకు ఇందులో మాటెస్టులు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్‌లో క్లాసులు ఉంటాయి. కొత్తగా వస్తున్న ప్రశ్నపత్రాల సరళిని అనుసరించి వీటిని తయారు చేశారు.
2. ఆలివ్‌బోర్డ్ యాప్..
ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే.. రోజువారీ కరెంట్ అఫైర్స్‌ను ఫ్లాష్ కార్డ్స్‌లా చదువుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. దేశవ్యాప్తంగా నిర్వహించే దాదాపు అన్ని పరీక్షల గురించి ఇందులో సమాచారం దొరుకుతుంది. ప్రాక్టీస్ సెషన్స్‌తోపాటు లైవ్ క్లాసులు ఉంటాయి. టాపిక్ వారీగా, ప్రశ్నల స్థాయిని అనుసరించి విడివిడిగా మాటెస్టులు రాసే వీలుంది. ముఖ్యమైన పరీక్షలకు ఉచితంగా ఈ-బుక్స్ అందిస్తున్నారు. డౌన్లోడ్ చేసుకునే విధంగా స్టడీ నోట్స్ ఇస్తున్నారు.
3. గైడ్లీ యాప్..
ఈ యాప్.. బ్యాంకింగ్ పరీక్షలకు చదువుతున్న అభ్యర్ధుల కోసం రూపొందించడబడింది. ఐబీపీఎస్, ఎస్‌బీఐ వంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవారికి చాలా ఉపయోగపడుతుంది. మెటీరియల్, ప్రశ్నలు పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకునే వీలుంది. ప్రతిరోజూ మనం యాప్‌లో ఏం చేశామనేది ఒకచోట కనిపిస్తుంది. నెలవారీ కరెంట్ అఫైర్స్, వివిధ టాపిక్స్ కోసం ప్రత్యేకంగా మెటీరియల్ దొరుకుతుంది. పరీక్షలకు ఎలా చదవాలనే అంశంపై నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పిస్తూ, ఈ సంస్థ చేస్తున్న వీడియోలు యూట్యూబ్ లోనూ లభిస్తున్నాయి.
4. టెస్ట్ బుక్ యాప్..
ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్వర్ధులకు ఇది అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్ ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. చాలావరకూ మాటెస్టులు ఉచితం, అంతకంటే ఎక్కువ కంటెంట్‌ను వినియోగించుకోవాలి అనుకుంటే కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఫ్యాకల్టీ చెప్పే లైవ్ క్లాసులు వినడంతోపాటు ప్రతి టాపిక్‌కు ముందే తయారు చేసి ఉంచిన పాఠాలను సబ్జ్‌క్టుగా చదువుకునే అవకాశం ఉంది. పరీక్షలు రాసేటప్పుడు ఆ పరీక్ష అసలైన యూజర్ ఇంటర్‌ఫేస్ ఎలా ఉంటుందో అలాగే ఇందులో ఉంటుంది.