Candidates .. Today is the last date
mictv telugu

అభ్యర్థుల్లారా.. నేడే ఆఖరి తేదీ

June 4, 2022

Candidates .. Today is the last date

తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో వెలువడిన తొలి గ్రూప్ -1 ఉద్యోగాలకు నేటీతో దరఖాస్తుల గడువు ముగియనుందని అధికారులు తెలిపారు. వాస్తవానికి మే నెలాఖరుతోనే తుది గడువు ముగిసింది. కానీ, అభ్యర్థులకు అభ్యర్థన మేరకు అధికారులు జూన్ 4 వరకు అవకాశం కల్పించారు. మొత్తం 503 పోస్టులకు మే 31 నాటికి 3,48,095 దరఖాస్తులు వచ్చాయని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తుల ప్రకారం ఒక్కో పోస్టుకు 666 మంది పోటీ పడుతున్నట్లు ఇటీవలే అధికారులు పేర్కొన్నారు.

ఇక, గ్రూప్ 1లో ఉన్న ఉద్యోగాల విషయానికొస్తే..’జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు 5, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు 40, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోసులు 38, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పోస్టులు 20, డీఎస్పీ పోస్టులు 91, జైళ్ల శాఖలో డీఎస్పీ పోస్టులు 2, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్టులు 8, జిల్లా ఉపాధి అధికారి పోస్టులు 2, జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు 6, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులు 35, మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోస్టులు 121, జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు 5, సీటీఓ పోస్టులు 48, డిప్యూటీ కలెక్టర్లు పోస్టులు 42, అసిస్టెంట్ ఎక్సెజ్ సూపరింటెండెంట్ పోస్టులు 26,
ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులు 4, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టులు 2′ గా ఉన్నాయి.