Candidates..TSSPDCL exam on 17th of this month
mictv telugu

అభ్యర్థుల్లారా..టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ పరీక్ష ఈనెల 17న

July 15, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే విడుదలైన అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలకు సంబంధించి టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. ఎవరైతే అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలకు ఆప్లై చేసుకున్నారో ఆ అభ్యర్థులు తమ హాల్ టికెట్లను www.tssouthernpower.cgg.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

విడుదల చేసిన ప్రకటనలో..”అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ లైన్‌మెన్ పోస్టుల హాల్ టికెట్లు విడుదలైయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో పరీక్షలను నిర్వహిస్తున్నాం. ఇందులో జూనియర్ లైన్‌మెన్ పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఉంటుంది. ఇక, అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుంది. కావున అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. గురువారం రాత్రి నుంచే హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ www.tssouthernpower.cgg.gov.in ఉంచాం” అని పేర్కొన్నారు.