Candidates..web counseling will start from today
mictv telugu

అభ్యర్థుల్లారా..నేటి నుంచే వెబ్‌ కౌన్సెలింగ్‌ షురూ

September 7, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే బీటె‌క్‌లో ల్యాట్రల్‌ ఎంట్రీ కోసం నిర్వహించిన ఈసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి, అధికారులకు అభ్యర్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. ఈసెట్‌ వెబ్‌ ‌కౌ‌న్సె‌లింగ్‌ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుందని, అభ్యర్థులు బుధవారం నుంచి స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు స్లాట్లు బుక్ చేసుకోవాలని మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

విడుదల చేసిన ప్రకటనలో..”రాష్ట్రవ్యాప్తంగా ఈసెట్‌ వెబ్‌ ‌కౌ‌న్సె‌లింగ్‌ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబ‌ర్ 9 నుంచి 12వ తేదీ వ‌ర‌కు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. 9 నుంచి 14 వ‌ర‌కు వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవ‌చ్చు. 17వ తేదీన సీట్ల కేటాయింపు జ‌ర‌ుగుతుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ tsecet.nic.inను సంద‌ర్శించండి” అని అధికారులు పేర్కొన్నారు.

ఈసెట్‌ ఫలి‌తాల విషయానికొస్తే.. ఆగస్టు 12న ఈసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. విడుదలైన ఈసెట్‌ ఫలితాల్లో 90.69 శాతం ఉత్తర్ణత సాధించారు. పాలి‌టె‌క్నిక్‌ కోర్సులు పూర్తి‌ చే‌సిన విద్యా‌ర్థులు ఈసెట్‌ కౌన్సె‌లింగ్‌ ద్వారా నేరుగా బీటెక్‌ సెకం‌డి‌య‌ర్‌లో ప్రవే‌శాలు పొందు‌తారు.