Candy Fun house Company Wants To Pay You Six Figures To Eat Candy
mictv telugu

చాక్లెట్లు తినడమే ఉద్యోగం.. నెలకు జీతం రూ.6.5 లక్షలు

July 25, 2022

మీలో విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులెవరైనా ఉంటే.. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. అమెరికాలో ఉద్యోగం, జీతం నెలకు రూ.6.5 లక్షలు. పనేంటో తెలుసా? చక్కగా చాక్లెట్టు తింటూ వాటి టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పడమే. అమెరికాకు చెందిన క్యాండీ ఫన్‌ హౌజ్‌ అనే చాక్లెట్ల కంపెనీ ఈ ఉద్యోగం ఇవ్వనుంది. ఆ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన యాడ్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అమెరికాలోని క్యాండీ ఫన్‌ హౌజ్‌ అనే చాక్లెట్ల కంపెనీ చీఫ్‌ క్యాండీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టుకు ఎంపికైన వారు కాండియాలజిస్టుల బృందాన్ని లీడ్‌ చేయాల్సి ఉంటుంది. కంపెనీలో తయారయ్యే చాక్లెట్లను రుచి చూసి వాటికి రేటింగ్ ఇవ్వడమే ఈ పోస్టుకు ఎంపికైన వారు చేయాల్సిన పని. ఐదేళ్లు పైబడిన వారెవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి 1,00,000 డాలర్లను జీతంగా అందించనున్నారు.

ఆసక్తి ఉన్న వారు ఆగస్టు 31లోపు కంపెనీలో కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి అప్లై చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు టొరంటో లేదా న్యూజెర్సీ నెవార్క్‌లోని క్యాండీ ఫన్‌ హౌస్‌ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం https://candyfunhouse.ca/pages/careers వెబ్‌సైట్‌ను సందర్శించాలని కంపెనీ పేర్కొంది.