యుద్ధం ఆగాలంటే మరో ఛార్లీ చాప్లిన్ రావాలేమో.. జెలెన్‌స్కీ - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధం ఆగాలంటే మరో ఛార్లీ చాప్లిన్ రావాలేమో.. జెలెన్‌స్కీ

May 18, 2022

 

రష్యా జరుపుతున్న దాడుల్లో నిత్యం వందలాది మందికి పైగా తమ సైన్యం ప్రాణాలు కోల్పోతుందని, దీనిపై సినీ ప్రపంచం మౌనంగా ఉంటుందా? అని ప్రశ్నించారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థించారు. ప్రతిష్ఠాత్మక చలన చిత్రోత్సవం కేన్స్‌ వేడుక ప్రారంభత్సోవంలో ఉక్రెయిన్‌ నుంచి లైవ్‌ శాటిలైట్‌ వీడియో ద్వారా జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ నియంత మొదలుపెట్టిన యుద్ధానికి, తమ దేశం స్వేచ్ఛ కోసం ఓ పోరాటం చేస్తున్నదని, దీనిపై ప్రపంచమంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఉక్రెయిన్ పరిస్థితులు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఛార్లీ చాప్లిన్‌ తీసిన ‘ది గ్రేట్‌ డిక్టేటర్‌’.. సినిమాకు భిన్నంగా ఏం లేవని అన్నారు. ఆనాడు జరిగిన దారుణాల పట్ల సినీ ప్రపంచం మౌనంగా ఉండదని ఆ చిత్రం చాటిచెప్పిందని, ఇప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉండబోదని రుజువు చేసేందుకు మళ్లీ ఓ కొత్త చాప్లిన్‌ రావాలని, అతని అవసరం ఉందని జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు. సందర్భంగా ‘ది గ్రేట్‌ డిక్టేటర్‌’ సినిమాలో చాప్లిన్‌ చెప్పిన ఓ డైలాగ్‌ను జెలెన్‌స్కీ గుర్తుచేసుకున్నారు. ‘‘ ఏనాటికైనా ప్రజల నుంచి నియంతలు బలవంతంగా తీసుకున్న అధికారం.. తిరిగి ప్రజలకు వస్తుంది’’ అని
ఆయన చెప్పగా.. వేడుకకు హాజరైన వారంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.