ఉక్రెయిన్‌లోని భారతీయుడు తేడా.. పులులను వదిలిరానంటూ.. - MicTv.in - Telugu News
mictv telugu

ఉక్రెయిన్‌లోని భారతీయుడు తేడా.. పులులను వదిలిరానంటూ..

March 7, 2022

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచీ లక్షల మంది ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే.. ఒక భారతీయ డాక్టర్ మాత్రం ఉక్రెయిన్‌ని వదిలి భారత దేశానికి రాలేనంటున్నాడు. తన వద్ద రెండు చిరుత పులులు ఉన్నాయనీ, నేను వెళ్లిపోతే వాటిని ఎవరు చూస్తారంటూ తిరిగి ప్రశ్నిస్తున్నాడు. వివరాల్లోకిళితే… ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన డాక్టర్ గిరికుమార్ పాటిల్ పదిహేనేళ్ల క్రితం వైద్య విద్య అభ్యసించడానికి ఉక్రెయిన్ వెళ్లి అక్కడే డాన్‌బాస్ అనే నగరంలో స్థిరపడ్డాడు.

ప్రస్తుతం రష్యా దాడుల నేపథ్యంలో అందరూ తమ తమ దేశాలకు వెళ్తుండగా, గిరి కుమార్ మాత్రం తాను ఇండియా రాలేనంటున్నాడు. కారణం ఏంటంటే తన వద్ద రెండు చిరుత పులులు ఉన్నాయనీ, తన స్వార్థం కోసం వాటిని బలి పెట్టలేనంటూ వాపోయాడు. భారత ప్రభుత్వం చిరుత పులులను అనుమతిస్తే స్వదేశానికి వస్తానంటూ మంకు పట్టు పట్టాడు. ప్రస్తుతం బంకర్లో దాక్కొని ఉన్న పాటిల్ కేవలం ఆహారం కోసం మాత్రమే బయటకు వస్తున్నాడు. గత వారం ఓ విద్యార్థి తన పెంపుడు కుక్కతో వస్తానంటే భారత ప్రభుత్వం అందుకు అంగీకరించి, కుక్కతో సహా ఇండియాకు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రమాదకరమైన చిరుత పులులను తీసుకురావడానికి అనుమతిస్తుందా? లేదా? అనేది రానున్న రోజుల్లో చూడాలి.