ప్రభాస్‌తో మాట్లాడకుండా ఉండలేను : పూజా హెగ్డే - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్‌తో మాట్లాడకుండా ఉండలేను : పూజా హెగ్డే

March 8, 2022

17

తనకు ప్రభాస్‌కు మధ్య మాటల్లేవని ఇటీవల వార్తలు వస్తుండడంపై తొలిసారి హీరోయిన్ పూజా హెగ్డే స్పందించారు. అదంతా అబద్ధమనీ, ఆయనతో మాట్లాడకుండా ఉండలేనని వ్యాఖ్యానించింది. ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ప్రభాస్ మంచి మనసున్న వ్యక్తి. షూటింగ్ చేసే సమయంలో నాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చాలా బాగా చూసుకున్నారు. ప్రతీరోజూ ఇంటి నుంచి భోజనం తెప్పించి పెట్టేవారు. అలాంటి వ్యక్తితో గొడవలేంటి? అవన్నీ వదంతులే. ఎవరైనా ఒక్కసారి ప్రభాస్‌కు కనెక్ట్ అయితే ఆయనను వదిలి ఉండలేరు’ అంటూ వివరించింది. కాగా, వీరిరువురూ కలిసి నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ నెల 11 న భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఇటీవల ముంబైలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉండడంతో వీరి మధ్యన ఏవో మనస్పర్థలు వచ్చాయని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు పూజా ఈ విషయంపై స్పష్టత ఇవ్వడంతో రూమర్లకు తెరపడినట్టయింది.

17