రాజధాని కార్యాలయాల తరలింపు కేసు రేపటికి వాయిదా - MicTv.in - Telugu News
mictv telugu

రాజధాని కార్యాలయాల తరలింపు కేసు రేపటికి వాయిదా

February 4, 2020

high court

ఏపీ ప్రభుత్వం.. రాజధాని కార్యాలయాలను కర్నూలుకు తరలించడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని మార్పులకు సంబంధించిన పిటిషన్లు ఇంకా పెండింగులో ఉండగానే ఆఫీసులను ఎలా తరలిస్తారని ప్రశ్నించింది.  కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్, విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని సవాలు చేస్తూ అమరావతి రైతులు వేసిన పిటిషన్‌పై ఈ రోజు కోర్టులో విచారణ జరిగింది. 

కార్యాలయాలను ఈ నెల 26 వరకు తరలించొద్దని మౌఖికంగా ఆదేశించినా పట్టించుకోకుండా ఎందుకు తరలిస్తున్నారని కోర్టు మండపడింది. అయితే ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. తరలింపు ప్రభుత్వ నిర్ణయమని, అమరావతిలో కార్యాలయాల నిర్వహణ సరిగాలేదని ఏజీ వాదించారు. దీకి కోర్టు స్పందిస్తూ.. అమరావతిలోని వేరే స్థలంలో కొత్త భవనాలను కట్టొచ్చు కదా సూచిస్తూ విచారణను రేపటికి వాయిదా వేశారు.