కెప్టెన్ గంగవ్వ.. ఈవారం బయటకు వచ్చేది వారేనా? - MicTv.in - Telugu News
mictv telugu

కెప్టెన్ గంగవ్వ.. ఈవారం బయటకు వచ్చేది వారేనా?

September 27, 2020

nvhnmvhm

బిగ్‌బాస్ సీజన్ 4లో గంగవ్వ ఈ వారం ఇంటి కెప్టెన్‌గా ఎన్నికయ్యారు. తొలివారం నోయెల్ అవగా, రెండో వారం లాస్య అయింది. మూడో వారం గంగవ్వ ఇంటి కెప్టెన్‌గా ఎన్నికయ్యారు. అలాగే మహానటి మెడల్ కూడా సాధించారు. ఈవారం రోబో టాస్క్‌లో గంగవ్వ ప్రదర్శించిన నటనకు గాను ఆమెకు మహానటి మెడల్ అందించారు. టాస్క్‌లో భాగంగా గంగవ్వ ఛార్జింగ్ కోసం బయటకు వెళ్లి అఖిల్, మోనాల్ ముందు పాస్‌కు వెళ్లాలని చెబుతారు. ఏమాత్రం వాళ్లకు అనుమానం రాకుండా గంగవ్వ నటించారు. ఆ వీడియోను చూపిస్తూ నాగార్జున గంగవ్వకు మహానటి మెడల్‌ను మెడలో వేశారు. ఆ వీడియో చూసినప్పుడు గంగవ్వ షాక్ అవడం ప్రేక్షకులను నవ్వించింది. తాను ఇంట్లో చేస్తుంది ఎవరూ చూడటం లేదని భావించినట్టున్నారు. ‘ఊర్ల అందరు సూస్తున్నరా నన్ను’ అని అడిగారు. అవును అనగానే నాలుక కరుచుకున్నారు. 

ఆ తర్వాత మహాకంత్రి మెడల్‌ను జబర్దస్త్ అవినాష్‌కు బహూకరించారు. అమ్మ రాజశేఖర్ దగ్గర దొంగచాటుగా ఛార్జింగ్ పెట్టుకోవడంతో అతనికి మహాకంత్రి మెడల్ అందించారు. ఇక మహా నాయకుడు మెడల్‌ను అభిజిత్‌కు వేశారు. టీమ్‌ను చక్కగా లీడ్ చేసి టాస్క్ గెలవడంలో అభిజిత్ మంచి ప్రదర్శన చేశాడని మహా నాయకుడు మెడల్ అందించారు. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది సస్పెన్స్‌గా మారింది. ఎనిమిది మందిలో లాస్య, మోనాల్ గజ్జర్ సేవ్ అయ్యారు. మిగిలినవారిలో హారిక, దేవీ నాగవల్లి, అఖిల్, నోయెల్, మహబూబ్, అరియానా ఉన్నారు. వీరిలో ముఖ్యంగా దేవీ నాగవల్లి, మహబూబ్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఇంట్లోంచి బయటకు వచ్చేలా ఉన్నారు. వారు వెళ్తూ ఒకరిని సేవ్ చేస్తారు. చూడాలి మరి ఇవాల్టి ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో.