రోహిత్ శర్మ బ్యాటింగే కాదు డాన్స్ కూడా చాలా బాగా చేస్తాడు. టీమ్ ఇండియాలో విరాట్ కోహ్లీతో పాటూ చాలా మంది డాన్సర్లు ఉన్నారు. బోలెడు సందర్భాల్లో వాళ్ళ డాన్స్ లను కూడా చేవాం. ానీ రోమిత్ శర్మ ఎప్పుడూ ఎక్కడా డాన్స్ చేసినట్టు చూడలేదు. ఇప్పుడు అదే రోహిత్ శర్మ డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తన భార్య రితిక, బావమరిది కునాల్ తో కలిసి రోహిత్ డ్యాన్స్ చేశాడు. గుడ్ న్యూస్ మూవీలోని లాల్ ఘఘ్రా పాటకు ముగ్గురూ డ్యాన్స్ చేశారు.
ప్రస్తుతం రోహిత్ శర్మ సెలవులో ఉన్నాడు. తన భార్య రితికా సోదరుడు కునాల్ వివాహం కోసం అతను విరామం తీసుకున్నాడు. గత రెండు రోజులుగా ఈ పెళ్ళికి సంబంధించిన పిక్స్, రోహిత్ తన భార్యతో కలిసి ఉన్ పిక్స్ బయటకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు పెళ్లిలో హిట్ మ్యాన్ చేసిన డ్యాన్స్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తొలి వన్డే నుంచి రోహిత్ ఔట్
Shaddi vibes #Rohitsharmapic.twitter.com/4HjoPMhtkH
— KL Siku Kumar (@KL_Siku_Kumar) March 17, 2023
బావమరిది కునాల్ వివాహం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు రోహిత్ శర్మ టీమిండియాకు దూరమయ్యాడు. అతని స్థానంలో హార్దిక్ పాండ్యా టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు. తరువాత జరిగే మ్యాచ్ ల సమయానికి రోమిత్ మళ్ళీ వెనక్కి వచ్చేయనున్నాడు. విశాఖపట్నంలో జరిగే మ్యాచ్ కు రోహిత్ నేరుగా వచ్చి జాయిన్ అవుతాడని సమాచారం.