కోహ్లీ డక్ ఔట్..సెంచరీ దిశగా మయాంక్ - MicTv.in - Telugu News
mictv telugu

కోహ్లీ డక్ ఔట్..సెంచరీ దిశగా మయాంక్

November 15, 2019

ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పట్టు బిగుస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ డక్ ఔట్ అయి నిరాశపరిచినప్పటికీ యువ ఆటగాడు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాదించాడు. కోహ్లీ తాను ఎదుర్కొన్న రెండో బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. 

Captain virat kohli.

అబు జయేద్ వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈరోజు ఒక వికెట్ నష్టానికి 86 పరుగులతో ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 43 పరుగులతో క్రీజులోకి వచ్చిన పుజరా 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అబు జయేద్ బౌలింగ్‌లో సైఫ్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 83 పరుగులు, రహానే 32 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ప్రస్తుత స్కోరు మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు. ఈ మూడు వికెట్లను జయేద్ పడగొట్టడం గమనార్హం.