అదుపుతప్పిన కారు.. ఏడుగురు చిన్నారులు మృతి

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పది‌మంది చిన్నారులతో అతివేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కాల్వలో పడింది. దీంతో కారులోని ఏడుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పంచమహల్ వద్ద సోమవారం ఉదయం చోటు‌చేసుకుంది.Car accident.. 7 childrens deadవిషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న మరో ముగ్గురు చిన్నారులను రక్షించి,  సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.