గుంటూరులో కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

గుంటూరులో కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురు మృతి

July 2, 2020

Car And Lorry Accident In Guntur

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ భారీ కంటైనర్ కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ప్రమాదంలో కారు ముందు భాగంలో ఓ వైపు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

విజయవాడవైపు సిఫ్ట్ డిజైర్ కారు వెళ్తుండగా దాని వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది. కారులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడి చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. మృతులు అత్తులూరి బలరాం(25), ఫిరో అహ్మద్‌(35), వింజమూరి హరికృష్ణ(26), మేడసాని వెంకట శ్రీచందు(25)గా గుర్తించారు. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో విషాదం నింపింది.